NTR Birthday Wishes to Allu Arjun | రెండు రోజుల క్రితం విడుదలైన పుష్ప టీజర్ సోషల్ మీడియాను ఒక ఊపు ఉపేసింది. ఇక అదే రోజు సాయంత్రం రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. అంతేకాదు గత రెండు రోజులుగా ట్విట్టర్లో బన్నీ హవానే నడుస్తుంది. హ్యాపీ బర్త్‌డే బన్నీ అనే హాష్ టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక శనివారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు స్టార్ సెలబ్రెటీలు బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా శనివారం రాత్రి తారక్ హ్యాపీ బర్త్‌డే బావా అల్లు అర్జున్ అంటూ బన్నీకి విషెస్ తెలిపాడు.
దీనికి బన్నీ స్పందించి థ్యాంక్యూ యూ ఫర్ యువర్ లవ్లీ విషెస్ బావా.. వార్మ్ హగ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి తారక్ ఓన్లీ హగ్సేనా? పార్టీ లేదా పుష్ప అంటూ బన్నీ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు. ఇక బన్నీ కూడా తారక్ స్టైల్లో వస్తున్నా అంటూ ఎన్టీఆర్ 30 డైలాగ్‌తో సరదాగా రిప్లై ఇచ్చాడు. ఈ మొత్తం కన్వర్జేషన్ అటు మెగా బన్నీ ఫ్యాన్స్‌ను, ఇటు తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. బావా అంటూ వీళ్ల ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే అందరిలోను తెలియని ఆనందం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప-2తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక తారక్, కొరటాలతో ఎన్టీఆర్30 ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
Wishing you a Very Happy Birthday Bava @alluarjun. Have a great one !!
— Jr NTR (@tarak9999) April 8, 2023
Only hugs? Party Leda Pushpa? 🤣
— Jr NTR (@tarak9999) April 8, 2023
Vasthunna !! 😉
— Allu Arjun (@alluarjun) April 8, 2023