టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప (Pushpa). ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ దాక్కో దాక్కో మేక కన్నడ వెర్షన్ ఇంట్రడక్షన్ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. జోకే జోకే మేకే (JokkeJokkeMeke Song) అంటూ వచ్చే కన్నడ వెర్షన్ బీట్ ఆడియెన్స్ లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా రషెస్ చూస్తే అర్థమవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ అద్బుతంగా కంపోజ్ చేసిన మ్యూజిక్ తో సింగర్ విజయ్ ప్రకాశ్ టీం పాడిన ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోంది.
పుష్ప తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కాబోతుంది. ఇక ఫస్ట్ సింగిల్
దాక్కో దాక్కో మేక పాటను ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ పాడటం విశేషం. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళంలో బెన్నీదయాల్ సాంగ్ పాడారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ పుష్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మిరోస్లా క్యూబా బ్రోజెక్.
#JokkeJokkeMeke will THRILL you from AUG 13th 🔥https://t.co/N082YlcInc
— Mythri Movie Makers (@MythriOfficial) August 5, 2021
A Rockstar @ThisIsDSP Musical 🎵
Sung by @rvijayprakash
Lyrics @Aazad_Varadaraj #PushpaTheRise#ThaggedheLe 🤙@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @resulp @adityamusic pic.twitter.com/ICSM6CbMAV
ఇవి కూడా చదవండి..
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?