అమ్మిత్ రావు, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవిభట్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిన్’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. చిన్మయ్ రామ్ దర్శకుడు. నిఖిల్ ఎం గౌడ నిర్మాత. సోమవారం ట్రైలర్ను లాంచ్ చేశారు. భూతనాల చెరువు నేపథ్యం ఏమిటి?
అక్కడి కాలేజీలో దాగి ఉన్న రహస్యమేమిటి? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కితే ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశమని, ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.