Jinn trailer | తెలుగులో సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న చిత్రం జిన్ (Jinn). చిన్మయ్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అమిత్ రావ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. వరదరాజ్ చిక్‌బళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీ నుంచి షేర్ చేసిన పోస్టర్ ఇప్పటికే నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
భూతనాల చెరువు నేపథ్యం ఏంటీ..? కాలేజ్‌లో దాగి ఉన్న మిస్టరీ ఎంటీ.? అనే ఎలిమెంట్స్ తో సస్పెన్స్‌గా సాగుతున్నట్రైలర్లో నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజీ బిల్డింగ్ నుంచి బయటకు రాలేకపోవడం, మధ్యలోజిన్ రాక వంటి అంశాలతో కట్ చేశారు.
జిన్ టైటిల్ చాలా బాగుందన్నాడు నిర్మాత రాజ్ కందుకూరి. జిన్ లో గుడ్ జిన్ , బ్యాడ్ జిన్ అని రెండు రకాలుంటాయి. సరిగ్గా భయపెడితే ప్రేక్షకులు హార్రర్ చిత్రాలను ఆదరిస్తారు. కరెక్టుగా భయపెడితే ప్రేక్షకులు హార్రర్చిత్రాలను ఆదరిస్తారు. సినిమాకు భాషా సరిహద్దులుండవు. గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్‌ను మాత్రమే ఉంటాయన్నాడు. జిన్‌లో గుడ్ జిన్ ఉంటుంది..బ్యాడ్ జిన్ ఉంటుంది. మూవీ ట్రైలర్ చూస్తే ఇది బ్యాడ్ జిన్ గురించి చెబుతున్నట్టుగా కనిపిస్తోందన్నాడు నటుడు సోహెల్.
ఫస్ట్ లుక్ పోస్టర్లో హాలీవుడ్ సినిమాలా ఘోస్ట్‌ను తలపించే విగ్రహంతోపాటు బ్యాక్ డ్రాప్లో కూడా భయాన్ని రేకెత్తించేలా ఉన్న వింత ఆకారాలను ఆసక్తి పెంచుతున్నాయి. ఈ మూవీని డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాశ్ తుంబినాడు, రవి భట్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిన ఈ చిత్రానికి అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిఖిల్ ఎం గౌడ నిర్మిస్తున్నారు.
జిన్ ట్రైలర్..
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్‌తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్