Kubera | సింపుల్‌గా సాగే కథ, కథనంతో మ్యాజిక్ చేసే అతికొద్ది మంది డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు శేఖర్ కమ్ముల. ఇప్పటివరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్, లవ్ ట్రాక్ సబ్జెక్టులతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఈ సారి కాస్త రూటు మార్చి కుబేర (Kubera) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న చిత్రం కుబేర.
ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అంటూ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో ధనుష్ నవ్వుతూ కనిపిస్తున్న లుక్‌ను షేర్ చేయగా..ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తాజాగా ఈ చిత్రంలో కీ రోల్ చేస్తున్న పాపులర్ బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన పాత్ర లుక్ షేర్ చేశారు. స్టైలిష్ సూట్లో నోట్ల కట్టల మధ్య నిల్చున్న పోస్టర్ కుబేర సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తోంది.
ఈ మూవీని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
Unveiling the first look of Jim Sarbh from #SekharKammulasKUBERA.
A very happy birthday @jimSarbh ❤️🔥@dhanushkraja King @iamnagarjuna @iamRashmika @sekharkammula @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP @amigoscreation @AdityaMusic @KuberaTheMovie #Kubera pic.twitter.com/PB7eNXJVeI
— BA Raju’s Team (@baraju_SuperHit) August 27, 2024
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?