కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ముఖ్య పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘జిగ్రీస్’. హరీష్‌రెడ్డి ఉప్పుల దర్శకుడు. కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శభాకాంక్షలు అందించారు.
మారుతీ 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ని పై నుంచి చూపించడం ఈ స్టిల్‌లో ఆసక్తికరమైన విషయం. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్షిప్, నాస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్ నేపథ్యంలో సాగే హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వరాదిత్య, సంగీతం: కమ్రాన్.