కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకుడు. కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదలకానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌కి అద్భుతమైన అనుభూతినిస్తుందని, ఆద్యంతం నవ్వుకునేలా సినిమా ఉంటుందని, సకుటుంబంగా చూడాల్సిన సినిమా ఇదని దర్శకుడు హరీష్‌రెడ్డి ఉప్పుల చెప్పారు.
ఇందులోని ప్రతి సన్నివేశాన్నీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని, అద్భుతమైన లొకేషన్స్‌లో సినిమాను షూట్ చేశామని హీరోలు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా తెలిపారు. ఎంత నవ్విస్తుందో అంత ఉద్వేగానికి లోను చేసే సినిమా ఇదని నిర్మాత కృష్ణ వోడపల్లి అన్నారు. ఇంకా సహనిర్మాత చిట్టెం వినయ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వరాదిత్య, సంగీతం: కమ్రాన్.