లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. గురుప్రసాద్ దర్శకుడు. ఈ సినిమాను ఆర్.కె.ఫిల్మ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ త్రిపాత్రాభినయం హైలైట్‌గా నిలుస్తుంది.
పోరాట ఘట్టాలు థ్రిల్‌ని పంచుతాయి. డ్రగ్స్ ముఠాల ఆటకట్టించి, గ్రామాల్లో రౌడీల ఆగడాలకు అడ్డుకట్టవేసే డాషింగ్ పోలీస్ ఆఫీసర్‌గా లక్ష్మీరాయ్ పాత్ర అందరిని మెప్పిస్తుంది. అంతర్లీనంగా చక్కటి సందేశం మేళవించిన కథాంశమిది. త్వరలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.