Jeevitha Rajashekhar | ఎనభైయవ దశకంలో వరుస సినిమాలతో అగ్ర శ్రేణి కథానాయికగా వెలుగొందింది నటి జీవిత. హీరో రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు వీడ్కోలు చెప్పి దర్శకురాలిగా, నిర్మాతగా అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే నటిగా మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. కాగా మూడు దశాబ్దాల తర్వాత జీవిత ముఖానికి మేకప్ వేయనున్నట్లు తెలుస్తుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం జీవిత కెమెరా ముందుకు రానున్నట్లు టాక్.
రజినీకాంత్ ప్రస్తుతం జైలర్‌తో పాటు కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్‌సలాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రజనీ పూర్తి స్థాయి పాత్రలో కాకుండా నిడివి తక్కువగా ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలో రజనీకి చెల్లెలిగా జీవిత కనిపించనుందట. ఇన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న జీవిత.. కేవలం రజనీ కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఇప్పటికే యభై శాతం షూటింగ్ కూడా పూర్తయింది. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
దాదాపు పుష్కర కాలం తర్వాత జీవిత శేఖర్ సినిమాకు మెగాఫోన్ పట్టింది. రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన జోసెఫ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందు జరిపిన ప్రమోషన్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేశాయి. కానీ తీరా రిలీజయ్యాక సినిమాకు డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.