జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగత్యా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఐసరి గణేష్ నిర్మాత. రాశీఖన్నా కథానాయిక. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. అయితే కథానుగుణంగా వీఎఫ్ఎక్స్ వర్క్‌కు అధిక ప్రాధాన్యం ఉండటంతో ఫిబ్రవరి 28కి చిత్రాన్ని వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు.
మార్వెల్ సినిమాల తరహాలో ఓ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే చిత్రమిదని, మన సంస్కృతి, మానవ సంబంధాలు ప్రధానంగా కథ నడుస్తుందని, ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి యువన్‌శంకర్ రాజా సంగీతాన్నందిస్తున్నారు.