JD Chakravarthy | ‘బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటింది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. అయితే నా బలం తెలుగు చిత్ర పరిశ్రమ. అందుకే మళ్లీ ఇక్కడ సినిమా చేస్తున్నా’ అన్నారు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి. ఆయన నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ ‘దయా’. ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు జేడీ. ఆయన మాట్లాడుతూ ‘కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే.. అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటింది.
సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి వుంటుది. దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్డ్రైవర్ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. అనుకోకుండా నాకు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది.పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో వుండదు. ఈ భయంలో వుండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపు తిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుక వెబ్‌సీరిస్ బాగా ఉపయోగపడుతుంది.వెబ్ సిరీస్‌లో కొత్త వాళ్లకు ఆదరణ దక్కుతుంది. కానీ థియేటర్లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ వుంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్’ అన్నారు.