Jayasudha | విలన్‌గా జయసుధ తనయుడు..లుక్ అదిరిపోయింది
తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry) లో జయసుధ (Jayasudha) కు ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈమె కొడుకు నిహార్ కపూర్ (Nihar Kapoor) ఓ సినిమాలో హీరోగా నటించాడు.

తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry) లో జయసుధ (Jayasudha) కు ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లుగా ఈమె ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఎన్నో వందల సినిమాలు చేసారు జయసుధ. ఈమె వారసులు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇప్పటికే ఈమె కొడుకు నిహార్ కపూర్ (Nihar Kapoor) ఓ సినిమాలో హీరోగా నటించాడు. అయితే అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు ఈయన ప్రతినాయకుడిగా వస్తున్నాడు. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే కథానాయకుడు లక్ష్య్.
‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఇప్పుడు తనదైన పంథాలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ (Gangster Gangaraju) అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. రీసెంట్‌గానే ఈ సినిమాలో లక్ష్య్ లుక్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోన్న నిహార్ కపూర్ లుక్‌ను విడుదల చేశారు. సహజ నటి జయసుధ తనయుడైన నిహార్, ఈ సినిమాతో విలన్‌గా పరిచయం అవుతుండటం విశేషం. సెప్టెంబర్ 7న నిహార్ కపూర్ పుట్టినరోజు..ఈ సందర్భంగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ యూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది.
చేతిలో కత్తి పట్టుకుని, గడ్డంతో ఉన్న నిహార్ లుక్ చూస్తుంటే భయం గొలిపేలా ఉంది. కచ్చితంగా తనకు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ నటుడిగా మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు నిహార్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. మరి విలన్‌గా నిహార్ కపూర్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలిక.

ఇవి కూడా చదవండి..
Aditi Rao Hydari | చీరకే అందం తెచ్చిన హైదరాబాదీ భామ
Dubai sheik SP balu song| దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట..వీడియో వైరల్
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

