సీనియర్ నటి జయసుధ చైర్మన్‌గా 15 మందితో కూడిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని బుధవారం ప్రకటించారు. ఇటీవల ఎఫ్డీసీ కార్యాలయంలో జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ప్రభుత్వం తనకు అప్పగించిన ఈ బాధ్యతను ఓ సవాలుగా తీసుకొని ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తానని జయసుధ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఈ కమిటీ పనిచేయాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజు కోరారు. గద్దర్ అవార్డ్స్‌కు అన్ని కేటగిరీలలో కలిపి 1248 నామినేషన్లు అందాయని, ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ మొదలుపెడతామని ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. హరీష్ తెలిపారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబ్యూ చిత్రాలు, డాక్యుమెంటరీ, లఘు చిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్ తదితర కేటగిరీలలో 76 దరఖాస్తులు అందాయని జ్యూరీ సభ్యులు తెలిపారు.