Vetrimaaran | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కథను నమ్మి సినిమా చేసే అతికొద్ది మంది దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran). ఈ స్టార్ దర్శకుడు తెరకెక్కించిన విడుదల పార్టు-2 డిసెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ దర్శకుడికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ జయం రవి (jayam ravi). వెట్రిమారన్, జయం రవి కాంబోలో సినిమా ఉండబోతుందన్న వార్త ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూలో వెట్రిమారన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు జయం రవి. నేను వెట్రిమారన్‌ను కలిసి ఓ సినిమా చేద్దామని అడిగాను. తాను చాలా ప్రాజెక్టులు చేయాల్సి ఉందని చెప్పాడు. ఈ సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ చేద్దామన్నాడు. ఇప్పుడిక నేను వెట్రిమారన్ స్టోరీ వినబోతున్నానంటూ చెప్పాడు జయం రవి.
ఈ చిత్రానికి వెట్రిమారన్ కథనందిస్తుండగా.. పాపులర్ డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ఇన్సైడ్ టాక్. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మరి వెట్రిమారన్ జయం రవి కోసం ఎలాంటి కథ రెడీ చేశాడన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
జయం రవి ప్రస్తుతం ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న Genie సినిమాతోపాటు మరో ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
– I met #Vetrimaaran & ask him Let’s do a Film, He said that i have to do Many Projests
– After Finishing all of it Let’s Make a Film
– Now I’m going to Hear Vetrimaaran’s Story#JayamRavipic.twitter.com/QPVFnLmhZb— Movie Tamil (@MovieTamil4) December 11, 2024
Satyadev | బ్రతికిపోయాం.. ముఫాసా ది లయన్ కింగ్‌లో టాకాకు సత్యదేవ్ వాయిస్
Coolie | తలైవా బర్త్ డే స్పెషల్.. కూలీ షూట్ లొకేషన్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!