నీళ్ల్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించిన తెలంగాణ ఎట్లున్నదో కళ్లకుకట్టే చిత్రం ఇది. బొట్టుబొట్టునూ దోసిలిపట్టినట్టు తెలంగాణలో కళకళలాడే జలాశయాలు, పల్లెపట్టున పచ్చని పైర్లు, పట్టణాల్లో పరుగులు తీసే ప్రగతి… అన్నీ కలిసి సబ్బండ కులాలకు దక్కిన సంక్షేమ ఫలాలను ప్రతిబింబించేలా సయ్యద్ హస్మతుల్లా సృజన ఇది. జనగామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న ఈ చిత్రకారుడు తెలంగాణ ఉద్యమ కాలం మొదలు స్వరాష్ట్ర అభివృద్ధి వరకు ఎన్నో మలుపులను చిత్రాలుగా గీశారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా హస్మతుల్లా ప్రాణం పోసిన తాజా చిత్రమిది.