Madras Talkies PC 23 | కోల్‌కతా నేపథ్యంలో మణిరత్నం కొత్త సినిమా.. సెప్టెంబర్ 7న సినిమా టైటిల్ ప్రకటన!
ManiRatnam | దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్‌తో తీసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో, మణిరత్నం మళ్లీ తన మార్క్ రొమాంటిక్ జోనర్లోకి అడుగుపెట్టారు.
ManiRatnam | దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్‌తో తీసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో, మణిరత్నం మళ్లీ తన మార్క్ రొమాంటిక్ జోనర్లోకి అడుగుపెట్టారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కోల్‌కతా నగరంలోని విభిన్న రంగులు, అక్కడి వీధులు, స్థానిక రైళ్లు మరియు సాంస్కృతిక వాతావరణాన్ని ఈ టీజర్ అందంగా ఆవిష్కరించింది.
మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకరైన ‘యువ’ సినిమాను ఈ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ మరోసారి గుర్తుచేస్తోంది. మణిరత్నం విజువల్ స్టైల్‌కు తగినట్లుగా ఏ.ఆర్. రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి ఏవీక్ ముఖోపాధ్యాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏకా లఖాని కాస్ట్యూమ్ డిజైనర్‌గా, శర్మిష్ఠ రాయ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను సెప్టెంబర్ 7న అధికారికంగా ప్రకటించబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

