న్యూఢిల్లీ: ఇవాళ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. జాతీయ టీచర్ అవార్డులు గెలిచిన వారితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఢిల్లీలోని 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గెలిచిన వారితో మాట్లాడుతూ.. పిల్లలు ఎక్కువగా స్క్రీన్కు బానిస అవుతున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లకు పిల్లలు హత్తుకుపోతున్నారన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ క్రీడల పట్ల పిల్లలో ఆసక్తి పెరిగితే, అప్పుడు ఆ స్క్రీన్ బానిసత్వం నుంచి వాళ్లు బయటపడే అవకాశాలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. క్రీడలు అంటే వీడియో గేమ్స్ కాదు అని ఆయన స్పష్టం చేశారు. పిల్లల్లో సృజనాత్మక పెంచాలని, వారిలో ఆటల పట్ల ఆసక్తి పెంచేలా చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రోగ్రామ్‌లను డిజైన్ చేయాలని టీచర్లకు ప్రధాని సలహా ఇచ్చారు.
డ్రగ్స్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొన్ని ప్రధాన నగరాలు, యూనివర్సిటీల్లో ఈ సమస్య ఉందని, కానీ దీని పట్ల సరైన అవగాహన లేదని, ఎటువంటి వివరణ లేకుండానే కొన్ని సార్లు ఆంక్షలు అమలు చేస్తున్నారని అన్నారు. పిల్లల ప్రవర్తన పట్ల టీచర్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వారిలో జరుగుతున్న బీహేవియర్ మార్పులను పరిశీలించాలన్నారు. యావత్ విద్యా వ్యవస్థకు తాను ఒక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, కేవలం పాఠ్య పుస్తకాల బోధనలతో మాత్రమే కాదు, పిల్లలతో మమేకంగా కలిస్తేనే వారిలో మార్పు వస్తుందన్నారు. బాల్యాన్ని అంతం చేయవద్దు అని, ఆ బాల్యాన్ని రక్షించే సామర్థ్యం టీచర్లకు ఉందని, పిల్లలు సజీవంగా ఉండేందుకు కావాల్సిన చర్యలన్నీ చేపట్టడమే టీచర్ల బాధ్యత అని ప్రధాని మోదీ తెలిపారు.
టీచర్స్ డే సందర్భంగా ఆయన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించారు.
#WATCH | Delhi: While interacting with one of the National Awardee Teachers, Prime Minister Narendra Modi says, “…Screen time has now become a form of addiction. A thought occurs to me: if a child begins to take a keen interest in sports, and by sports, I don’t mean video… pic.twitter.com/o7tnvSYOs0
— ANI (@ANI) September 5, 2026