బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’. అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు దర్శకుడు అట్లీ. ఆయన మాట్లాడుతూ ‘గతంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనోమ్, టీనేజ్ ముటంట్ నింజా టర్టల్స్ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ మాస్ట్రో స్పీరో రజటోస్ సమకూర్చిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌లా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతారు’ అన్నారు.