అగ్ర కథానాయిక నయనతార ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ సరసన ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ఆమెకిది తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత నయనతార తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళ యూట్యూబర్ విక్కీ దర్శకత్వంలో నయనతార ఓ సినిమాకు అంగీకరించిందని తెలిసింది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ నిర్మించనున్నారు.
గత కొంతకాలంగా తమిళంలో వరుసగా మహిళా ప్రధాన ఇతివృత్తాలకు ఎంచుకుంటున్నది నయనతార. తాజా చిత్రం కూడా లేడీ ఓరిమెంటెడ్ కథాంశమని, సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో తమిళ హాస్యనటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషించబోతున్నారు. నయనతార, యోగిబాబు నటించిన ‘కొలమావు కోకిల’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్ రిపీట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభంకానుందని సమాచారం.