జేడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ రచనా, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ చిత్రం టైటిల్, ఫష్ట్లుక్ పోస్టర్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. జేడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు.
ప్రీతి జింఘానియా రీఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో రాజేష్శర్మ, తనికెళ్ల భరణి, హిట్టెన్ తేజ్వాణి, మస్త్ అలీ, తులసి, ఈటీవీ ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అర్జున్ రాజా, సంగీతం: జిబ్రాన్, రాజ్ ఆషూ.