బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలే కాదు రొమాన్స్ కూడా పీక్స్‌లోకి వెళుతుంది. బుధవారం ఎపిసోడ్లో జెస్సీకి ఆరోగ్యం బాగోలేకపోయిన కూడా ఏ మాత్రం తగ్గట్లేదు.ఆ మధ్య బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్లి.. శ్వేతాతో మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టండి అని విచిత్ర కోరిక కోరిన జెస్సీ ఇప్పుమడు తన బెడ్‌పై అటు సిరి ఇటు ప్రియాంకని పక్కన కూర్చోబెట్టుకొని బుగ్గలు ఖాళీగా ఉన్నాయి. ముద్దు పెట్టండని అన్నాడు .
దీంతో సిరి.. కెమెరా నుంచి కాలు బయటకు వచ్చి మరీ తన్నుతుందని సెటైర్ వేసింది. ముద్దు పెట్టవే అని మళ్లీ సిరిని అడిగాడు జెస్సీ.. పెట్టనురా అది నీకు కూడా తెలుసు అని చెప్పింది . దీంతో జెస్సీ.. పింకీ నువ్ కూడా పెట్టవా నాకు అని అనడంతో సర్లే పెడతాలే బొజ్జో అంటూ అతని గెడ్డం పట్టుకుని సరసాలు ఆడటం మొదలుపెట్టింది. దీంతో సిరి.. సర్లే నేను వెళ్లనా మీరిద్దరూ మాట్లాడుకుంటారా? అని వీళ్ల సరసాలపై మరో సెటైర్ వేసింది.
నువ్ ఎక్కడికి పోతావ్.. నున్ నా పెద్ద బేబీవి అని అన్నాడు జెస్సీ. అవున్రా.. ఎంతమంది వచ్చినా నీకు నా తరువాతే ఎవరైనా అంటూ సిరి అన్నది. వీళ్ల సరసాలు వెండితెరని మించిపోయాయి. కెమెరాలు ఉన్నాయనే విషయం కూడా మరచిపోయి రెచ్చిపోతుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.