Vivo Y200 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై200 ప్రో 5జీ (Vivo Y200 Pro) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోందీ ఫోన్. వివో వై200 ప్రో 5జీ (Vivo Y200 Pro 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999 పలుకుతుంది. ఎస్బీఐ కార్డు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2500 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. రోజుకు రూ.45లతో ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. వీ-షీల్డ్ ప్రొటెక్షన్, 6-నెలల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉన్నాయి.
వివో వై200 ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400 x 1800 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది. ఈ ఫోన్ ర్యామ్ వర్చువల్‌గా మరో 8 జీబీ పెంచుకోవచ్చు.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తోపాటు 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 44వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 5జీ, డ్యుయల్ బాండ్ వై-ఫై (2.4 గిగా హెర్ట్జ్, 5 గిగా హెర్ట్జ్), బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.