They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఓజీ (They Call Him OG). సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో షూటింగ్ లొకేషన్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ ఆసక్తిక వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
ఈ చిత్రంలో పాపులర్ జపనీస్ నటుడు కజుకి కిటముర, ప్రముఖ థాయ్ యాక్టర్ Vithaya Pansringarm కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీ సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ వారితో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఇంతకీ ఈ క్రేజీ యాక్టర్లు ఓజీలో ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ వార్తతో సినిమాపై హైప్ మరింత పెరిగిపోతుంది.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మేకర్స్ చాలా కాలం క్రితం లాంచ్ చేసిన ఓజీ HUNGRYCHEETAH గ్లింప్స్.. పవన్ కల్యాణ్ పూర్తిగా నయా అవతార్‌లో చూపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.
Mohan Babu | కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు..స్టేట్మెంట్ రికార్డ్..!
Singham Again | ట్విస్ట్‌తో అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ ఓటీటీ ఎంట్రీ
Daaku First Single | డేగ డేగ డేగ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ డాకు మహారాజ్ సాంగ్ ప్రోమో