Janhvi Kapoor | అగ్ర కథానాయిక జాన్వీకపూర్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో ఈ భామ తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘చుట్టమల్లే..’ అనే ప్రేమగీతాన్ని విడుదల చేశారు. ఈ పాట సోషల్‌మీడియలో ట్రెండింగ్‌లో ఉంది. జాన్వీకపూర్ అందచందాలు, ఎన్టీఆర్ నృత్యాలు అభిమానులను అలరిస్తున్నాయి.
ఈ పాట గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది జాన్వీకపూర్. సాధారణంగా ఏదైనా పాట రిలీజైనప్పుడు అందులోని లోపాలను చూపిస్తూ ట్రోల్స్ చేస్తుంటారని, అయితే ‘చుట్టమల్లే’ పాటకు ఎలాంటి ట్రోల్స్ రాకపోవడం చాలా ఆనందంగా ఉందని జాన్వీకపూర్ చెప్పింది. ఈ పాటకు సంబంధించి అభిమానులు చేస్తున్న రీల్స్‌ను తన సోషల్‌మీడియా ఖాతాల్లో ప్రతిరోజు షేర్ చేస్తున్నది జాన్వీకపూర్. ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.