Jani Master | లేడి డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలతో పాటు పోక్సో కేసులో అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగు రోజులు పాటు పోలీసు కస్టడీలో ఉన్న అతడిని నార్సింగి పోలీసులు విచారించగా.. కస్టడీ గడువు ముగియడంతో అతడిని పోలీసు స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఇక కోర్టు విచారించిన అనంతరం అక్టోబర్ 03 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Also Read..