Devara Movie | ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి తారక రామరావు హీరోగా వచ్చిన చిత్రం దేవర. సోలో హీరోగా ఎన్టీఆర్ (Jr NTR) నుంచి ఆరేళ్ల తర్వాత వచ్చిన సినిమా.. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన నాలుగో సినిమా.. ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా.. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమైన సినిమా.. ఓవర్సీస్లో ప్రీసేల్లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన తొలి సినిమా.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, భారీ అంచనాలు మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దేవర’ మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
వరల్డ్ వైడ్గా ఫస్ట్ రోజే రూ. 172 కోట్ల కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. దీంతో ప్రభాస్ ఆదిపురుష్ పేరిటా ఉన్న (రూ.140 కోట్ల) రికార్డును బద్దలు కొట్టింది. ఇకపోతే ఎన్టీఆర్ కెరీర్లో ఇది హైయెస్ట్ కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. ఇక రానున్న రెండు రోజులు వీకేండ్తో పాటు దసరా సెలవులు వస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక డే1 అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో చూసుకుంటే దేవర ఐదో స్థానంలో ఉంది. రూ. 223 కోట్లతో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో బాహుబలి (రూ.217 కోట్లు) మూడో స్థానంలో కల్కి (రూ.180 కోట్లు) నాలుగో స్థానంలో సలార్ (రూ.178 కోట్లు) ఉన్నాయి.
No force can hold back the TSUNAMI OF #DEVARA 🔥#BlockbusterDEVARA pic.twitter.com/oGhYIZ0TuG
— Devara (@DevaraMovie) September 28, 2024