శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఎక్కడికెళ్లినా తనతోపాటు ఓ దిండుని కూడా తీసుకెళ్తుంటారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు జాన్వీ తనతోపాటు దిండును తీసుకెళ్లడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా? అనే అంశంపై పలు కథనాలు కూడా వెలువడ్డాయి. రీసెంట్గా ఈ విషయంపై జాన్వీ స్పందించారు. ‘నాకు పిల్లో ఫోబియో ఉంది. నా షూటింగులు రకరకాల ప్రదేశాల్లో జరుగుతుంటాయి. ఒక్కోసారి నైట్ అక్కడే స్టే చేయాల్సొస్తుంది.
అలాంటి సందర్భాల్లో ఏ దిండు పడితే ఆ దిండును తలకింద వేసుకొని పడుకోలేను. కేవలం నా దిండుపై పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. దిండు మారితే ఇక ఆ రాత్రంతా కలత నిద్రే. అందుకే తోడుగా దిండు తీసుకెళ్తుంటా. ఈ ఫోబియా నా చిన్నప్పట్నుంచీ ఉంది. ఇందులోంచి బయట పడేందుకు చాలాసార్లు ప్రయత్నించా. ప్రయత్నించిన ప్రతిసారీ నిద్రకు దూరమయ్యా.’ అంటూ వాపోయారు జాన్వీ కపూర్. ఇక ఈ స్టేట్మెంట్ విన్న నెటిజన్లు.. ‘కొత్త దిండు కొనుక్కోవచ్చుగా?’, ‘నీ ప్రొడ్యూసర్లు కొత్త దిండ్లు కూడా కొనలేరా?’ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.