జైపూర్‌లో ఓ మహిళ మద్యం మత్తులో కారు నడుపుతూ.. ఓ బైక్‌ని ఢీకొట్టగా, ఆ బైక్‌పై ఉన్న బాలిక అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నటి జాన్వీ కపూర్ తన ఇన్‌స్టా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎవరైనా అంగీకరిస్తారా? మనిషి అన్న తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంతైనా ఉండాలి కదా!.
మద్యం తాగి వాహనం నడపడం వల్ల, నడుపుతున్న వారికే కాదు, చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదమే. ఈ విషయం ఎందుకు అర్థంకాదు? మద్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు దేశంలో గంటకు వందల్లో జరుగుతున్నాయి. తద్వారా ఎంతోమంది జీవితాలను కోల్పోతున్నారు. చట్టాలను గౌరవించడం మన ధర్మం. చట్టాలపై అవగాహన పెంచుకోవడం మన బాధ్యత. దయచేసి బాధ్యతగా బతుకుదాం.’ అంటూ ఇన్‌స్టా ద్వారా స్పందించారు జాన్వీ. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ ‘దేవర 2’, రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రాల్లో ప్రస్తుతం జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.