సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తారల్లో శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ ముందు వరుసలో ఉంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పింక్ కలర్ నైట్ సూట్లో ఉన్న ఓ ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి, దాని కింద.. ‘ఒకవేళ నేను తప్పిపోతే.. దయచేసి శిఖర్ పహారియాకు నన్ను అప్పగించండి’ అంటూ ఓ చమత్కారమైన సందేశాన్ని పొందుపరిచింది జాన్వీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎంతో ముద్దుగా ఉంది’ అంటూ ఒకరు కామెంట్ చేస్తే, ‘రిలేషన్షిప్ గోల్స్’ అంటూ మరొకరు అభినందించారు.
జాన్వీ, శిఖర్ పహారియా గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న విషయం విదితమే. అయితే, ఈ బంధాన్ని అధికారికంగా మాత్రం వారు ధృవీకరించలేదు. గతంలో ‘శిఖర్’ అనే పేరున్న నెక్లెస్‌ని జాన్వీ ధరించి కనిపించడం, శిఖర్ కూడా జాన్వీ నటించిన సినిమాలను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం, వీటితోపాటు గత ఏడాది జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జాన్వీతో కలిసి శిఖర్ కూడా సందడి చేయడం.. ఇవన్నీ వీరి రిలేషన్ రూమర్స్‌కి బలాన్ని చేకూర్చాయి. జాన్వీ రీసెంట్ పోస్ట్‌తో అది రూఢీ అయ్యింది.