సుమన్, అజయ్‌ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్య నైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జనం’. స్వీయ దర్శకత్వంలో వెంకటరమణ పసుపులేటి రూపొందించారు. ఈ నెల 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. గత ఏడాది నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కిందని మేకర్స్ తెలిపారు.
దర్శకనిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ ‘రాజకీయ వ్యవస్థలోని లోపాల్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి తరానికి చక్కటి సందేశాన్నందిస్తుంది. ఈ సినిమాలో సుమన్‌గారు పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. సందేశంతో పాటు థ్రిల్లింగ్ అంశాలుంటాయి’ అన్నారు.