Pawan Kalyan | టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పోరాట పటిమతో అంచలంచెలుగా ఎదిగిన నాయకుడాయన. 70వ జన్మదిన వేళ శ్రీ కె.సి.ఆర్. గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్నీ, సంతోషాన్నీ ఇవ్వాలని కోరుకొంటున్నాను. అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.