తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయకుడు’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. తన రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో కెరీర్లో తనకు ఇదే చివరి చిత్రమని విజయ్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై తమిళనాటు భారీ అంచనాలు నెలకొన్ని ఉన్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నామని, సంక్రాంతి బరిలో రాజకీయ సందేశాత్మక చిత్రంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రమిదే కావడంతో బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని తమిళ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.