Jailer vs Jailer | ఒకే టైటిల్‌తో వేర్వేరు సినిమాలు రావడం సాధారణంగా కనిపించేదే. ఒకే భాషలో సేమ్ టైటిల్‌తో వచ్చే సినిమాలైనా కావొచ్చు.. లేదంటే వేర్వేరు భాషల్లో ఒకే టైటిల్‌తో కూడా సినిమాలు విడుదల కావడం చూస్తుంటాం. కానీ ఒకే టైటిల్‌తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. సరిగ్గా అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటనే కదా మీ డౌటు.. జైలర్ (Jailer).
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్నాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న జైలర్ ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది తలైవా టీం. మలయాళంలో జైలర్ టైటిల్‌తో (Dhyan Sreenivasan) హీరోగా తెరకెక్కిన సినిమా రజినీకాంత్ జైలర్‌తో పోటీపడనుంది.
జైలర్ టైటిల్ వివాదం విషయంలో మలయాళ డైరెక్టర్ సక్కిల్ మదాథిల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఆగస్టు 10నే రిలీజ్ కానుంది. రజినీకాంత్ జైలర్ కేరళలో కూడా విడుదల కానుందని తెలిసిందే. అదే రోజు మాలీవుడ్‌లో సేమ్ టైటిల్‌తో సినిమా రిలీజ్ కానుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇలా ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుందన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Jailer vs Jailer CLASH confirmed for August 10th.#Jailer pic.twitter.com/289OTlfbSc
— Manobala Vijayabalan (@ManobalaV) July 24, 2023