చిన్న, మధుప్రియ, రుచిక ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘జై జై దుర్గమ్మ’. సుభాని దర్శకుడు. ఎం.అనిత నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
అతిథులుగా విచ్చేసిన నిర్మాత సాయివెంకట్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ట్రైలర్‌ని విడుదల చేయగా, మరో అతిథి వి.సముద్ర చిత్ర లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులందరూ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించామని, భక్తి ప్రధానంగా సినిమా సాగుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నందన్‌కృష్ణ, సంగీతం: జయసూర్య, నిర్మాణం: ANI క్రియేషన్స్