Jai Hanuman Movie | ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma). తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ‘జై హనుమాన్’ అంటూ ఈ సినిమా రానుండగా.. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ చిత్రం.
అయితే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దీపావళి కానుకగా ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు నటించబోతున్నారు అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. మరోవైపు ఈ సినిమా గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమాన్ సినిమా క్లైమాక్స్‌లో చివరి ఐదు నిమిషాలలో వచ్చే హై ఏదైతే ఉందో అదే ఊపు జై హనుమాన్ సినిమాలో రెండు గంటలు ఉంటుందని వెల్లడించాడు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు.
This Diwali, bringing the legends to life with a tale that rekindles the flames of valor and honors our Indian Itihasas❤️🔥@MythriOfficial @ThePVCU #JAIHANUMAN 🔥 #NaveenYerneni @mythriravi #PVCU #DIWALIisCOMING 🪔 pic.twitter.com/sjOFBC5vIV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2024