భరత్, ప్రీతి జంటగా నటిస్తున్న చిత్రం ‘జగన్నాథ్’. భరత్, సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీలం పురుషోత్తం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో హీరో మంచు మనోజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తన స్నేహితులతో కలిసి భరత్ ఎంతో పాషన్‌తో ఈ సినిమా తీశాడు. కోటి రూపాయలతో తీసింది చిన్న సినిమా, వెయ్యికోట్లతో తీసింది పెద్ద సినిమా అనుకోవడానికి వీల్లేదు. అంతిమంగా సినిమా బాగుందా? లేదా? అన్నదే ముఖ్యమైన విషయం. టీజర్ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. వినూత్న కథాంశంతో ఈ సినిమా తీశామని హీరో రాయలసీమ భరత్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ మొపూరి, దర్శకత్వం: భరత్, సంతోష్.