Jagadeka veerudu athiloka sundari | మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి విడుదలై 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రీరిలీజ్‌కి కూడా భారీ ఎత్తునే ప్రమోషన్స్ చేశారు. చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్వినీదత్ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే చిత్ర రీరిలీజ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీవీలలో ఈ మూవీ చాలా సార్లు ప్రసారం అయిన వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపారు. ఈ క్రమంలో తొలిరోజు ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే విధంగా రూ.1.75 ఓపెనింగ్స్ వచ్చినట్లు మేకర్స్ తెలియజేశారు.
రీరిలీజ్‌లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టడం గ్రేట్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మే 9నే విడుదలైన సమంత నిర్మాణంలో వచ్చిన `శుభం` మూవీ కలెక్షన్లు కూడా ఆల్మోస్ట్ చిరంజీవి `జగదేక వీరుడు అతిలోక సుందరి`కి దగ్గరగా ఉండటం విశేషం అని చెప్పుకోవాలి . ఈ మూవీ 1.5కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. చాలా చిన్న మూవీగా విడుదలై ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం గొప్పనే అని అంటున్నారు. జగదేక వీరుడు అతిలోకు సుందరితో పాటు సమంత నిర్మించిన శుభం చిత్రాలు కూడా రానున్న రోజులలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. జగదేక వీరుడు అతిలోకు సుందరి చిత్ర విషయానికి వస్తే.. చిరంజీవి ఇమేజ్‌ని మార్చేసిన మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వైజయంతి మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలైంది. మూవీ రిలీజ్ అయిన సమయంలో తుఫాన్ భీబత్సం సృష్టించింది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆడియెన్స్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. చిత్రాన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు. ఇక మే 9న ఈ మూవీని 4కేలో, 8కేలోకి మార్చి హెచ్డీ క్వాలిటీతో విడుదల చేశారు. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి విశేష స్పందన దక్కింది. అయితే పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల రీ రిలీజ్‌లతో పోల్చితే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం తక్కువ వసూళ్లే రాబట్టిన ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వసూళ్లని రాబట్టిందని చెప్పొచ్చు.