‘అర్జున్చక్రవర్తి’ చిత్రం ద్వారా కెమెరామెన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు జగదీష్ చీకటి. ఈ సినిమాకుగాను ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా పురస్కారాల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జగదీష్ చీకటి తన సినీ ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఫొటోగ్రఫీలో ఎన్నో అవార్డులు పొందానని, వందకుపైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల కోసం పనిచేశానని, ‘జతకలిసే’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యానని తెలిపారు.
‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి నేచురల్ లైటింగ్‌లో షూటింగ్ చేశామని, కశ్మీర్లో మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్లో తీసిన విజువల్స్ అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా సినిమాలో ైక్లెమాక్స్ ఘట్టాలు హైలైట్‌గా నిలిచాయని వివరించారు. ఈ చిత్రానికిగాను అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులొచ్చాయని కోలీవుడ్ కేరవ్యాన్, మోకో, ది బుద్ధా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులందుకున్నానని జగదీష్ చెప్పారు.
‘అర్జున్ చక్రవర్తి’ డైరెక్టర్ విక్రాంత్రుద్ర వరల్డ్‌క్లాస్ స్టాండర్స్‌తో సినిమా తీశారని, కలర్ వేరియేషన్స్‌కు తగినట్లు మూడు కెమెరాలతో షూట్ చేశామని అన్నారు. భవిష్యత్తులో సినిమాటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ బెస్ట్ విజువల్ అవుట్‌పుట్ ఇచ్చేందుకు శ్రమిస్తానని జగదీష్ చీకటి ధీమా వ్యక్తం చేశారు.