అమెరికాలో జాతి రత్నాలు టీమ్ సందడి
ఒకప్పుడు ఓవర్సీస్లో ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ వసూలు చేసిన తెలుగు సినిమాలు ఉన్నాయి. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓవర్సీస్లో వన్ మిలియన్ వచ్చింది అంటే పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎందుకంటే కేవలం ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ వసూలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే కరోనా తర్వాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
అక్కడ వన్ మిలియన్ పక్కన పెట్టండి.. కనీసం హాఫ్ మిలియన్ దాటడం కూడా ఇప్పుడు కష్టమైపోయింది. ఎందుకంటే కోవిడ్ కారణంగా ఓవర్సీస్ ఆడియన్స్ పూర్తిగా ఓటీటీ సినిమాలకు అలవాటు పడిపోయారు.దాంతో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మన సినిమాలు మునుపటిలా వసూళ్లు సాధించలేదు.
ఇలాంటి సమయంలో విడుదలైన జాతిరత్నాలు ఓవర్సీస్ మార్కెట్లో మళ్లీ ఆశలు చిగురించేలా చేసింది. చాలా చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా.. ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ సినిమా విదేశాల్లో వన్ మిలియన్ మార్క్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది.
దాంతో తమ సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఓవర్సీస్ ప్రేక్షకులకు అక్కడికి వెళ్లి థాంక్యూ చెప్తున్నారు జాతి రత్నాలు. ఒక వీకెండ్ మొత్తం అక్కడ స్పెండ్ చేయడానికి షెడ్యూల్ సిద్ధం చేసుకొని నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి అక్కడికి వెళ్లారు.
అమెరికాలో అల్లరే అల్లరి
అమెరికా వెళ్లిన తర్వాత వీళ్లు అక్కడ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వాళ్లు చేస్తున్న అల్లరి.. అలాగే వాళ్లని చూడడానికి వస్తున్న ప్రేక్షకులు చేస్తున్న అల్లరి ఈ రెండింటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కేవలం జాతి రత్నాలు సినిమా మాత్రమే కాకుండా తమ ముందు సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి.
వీళ్ళ అల్లరితో అమెరికాను కూడా అమీర్ పేటగా మార్చేశారు. ఏదేమైనా ఈ సినిమా సాధించిన విజయం అలా ఉంది మరి.
ఇప్పటికే దాదాపు రూ.32 కోట్ల షేర్ వసూలు చేసింది జాతి రత్నాలు. అందుకే సక్సెస్ సంబరాలు కూడా ఏడు సముద్రాల అవతల చేసుకుంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికి రూ.22 కోట్ల లాభాలు తీసుకొచ్చింది జాతిరత్నాలు. అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు.
ఇవి కూడా చదవండి..
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
జలపాతంలా హంసానందిని నయగారాలు
పింక్ రీమేక్‌కు ‘వకీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేదట..!
ఫేక్ అకౌంట్స్ నమ్మోద్దంటూ వైష్ణవ్ తేజ్ ప్రకటన
ఎవరు మీలో కోటీశ్వరులు న్యూ ప్రోమో
సీటీమార్ నుండి పెప్సీ ఆంటీ మాస్ మసాలా సాంగ్ విడుదల
నేను దేశ భక్తురాలిని.. అవినీతిపరురాలిని కాదు: కంగనా రనౌత్
కీర్తి సురేష్ కనిపించట్లేదంటూ నితిన్ ట్వీట్.. పోలీసుల రిప్లై..
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు 60 రోజుల మాస్టర్ ప్లాన్
ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

