Radhe shyam pre release event | ప్రభాస్ కోసం హోస్ట్‌గా మారిన యంగ్ హీరో

Naveen polishetty to host Prabhas Radhe shyam | బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు ఈయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. వరుసగా ఈ సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నాడు. కొత్త సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ.. థియేటర్లో ఈయన కనిపించి రెండేండ్లకు పైగానే అవుతుంది. 2019లో విడుదలైన సాహో తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ నుంచి సినిమా రాలేదు. దీంతో ఈయన నుంచి వస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్‌ను కూడా మొదలుపెట్టేసింది రాధే శ్యామ్ చిత్ర యూనిట్. వరుసగా పాటలను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది. గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించబోతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అయితే ఇక్కడే ఒక వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జాతిరత్నాలు సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా విజయం సాధించడానికి ముఖ్య కారణం ఆ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషనే కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి తన హ్యూమర్‌తో ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేశాడు. అది కాకుండా సినిమా ట్రైలర్‌ను ముంబై వెళ్లి మరి ప్రభాస్‌తో లాంఛ్ చేయించి సినిమాపై హైప్ పెంచారు. ఇవన్నీ జాతిరత్నాలు సినిమా విజయానికి కారణమయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ హీరోను తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవాలని ప్రభాస్‌తో పాటు రాధేశ్యామ్ యూనిట్ భావించింది. ఇదే విషయాన్ని యంగ్ హీరో దృష్టికి తీసుకెళ్లింది. అయితే ప్రభాస్‌తోనూ, యూవీ బ్యానర్‌తో తనకున్న అనుబంధంతో నవీన్ పోలిశెట్టి కూడా ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా చేసేందుకు ఒప్పుకున్నాడట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నవీన్ కామెడీ టైమింగ్, పంచులతో ఈ ఈవెంట్లో ఎంటర్టైన్మెంట్ డబుల్ కావడం ఖాయమని అనుకుంటున్నారు. మరి ఇంత పెద్ద ఈవెంట్‌ను ఈ యంగ్ హీరో ఎంత హిలేరియస్‌గా మారుస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Radha Krishna About Radhe Shyam | ‘రాధేశ్యామ్’ వెనుక 12-15 ఏళ్ల కథ…సస్పెన్స్ పెట్టిన డైరెక్టర్
Prabhas: నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్
Tollywood | 2022లో ఆ నలుగురు హీరోల ట్రిపుల్ బొనాంజా..
పేరు చివర భర్త ఇంటి పేరు తీసేయడంపై నోరు విప్పిన ప్రియాంక
Shyam singha roy story | నాని శ్యామ్ సింగరాయ్ కథ ఇదేనా. సోషల్ మీడియాలో వైరల్..
Sai Pallavi | శ్యామ్ సింగరాయ్ ప్రీరిలీజ్ వేడుకల్లో ఎందుకు ఏడ్చిందో చెప్పిన సాయిపల్లవి
Radhe shyam pre release event | ప్రభాస్ కోసం హోస్ట్‌గా మారిన జాతిరత్నం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

