Ivana | తమిళ చిత్రం ‘లవ్‌టుడే’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది కథానాయిక ఇవానా. ‘సింగిల్’ చిత్రంతో ఈ భామ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నది. శ్రీవిష్ణు హీరోగా కార్తీక్‌రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఇవానా విలేకరులతో ముచ్చటించింది.
గీతా ఆర్ట్స్ వంటి పేరొందిన సంస్థ ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉందని చెప్పింది. ఈ సినిమాలో తాను డ్యాన్సర్ హరిణి పాత్రలో కనిపిస్తానని, అందరితో సరదాగా ఉంటూ కుటుంబం కోసం, తను ప్రేమించిన వారికోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అమ్మాయిగా తన క్యారెక్టర్ భిన్న పార్శాల్లో సాగుతుందని తెలిపింది. ‘ఫుల్‌లెంగ్త్ ఫన్ మూవీ ఇది.
ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. తెలుగు చాలా బ్యూటీఫుల్ లాంగ్వేజ్. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించా. శ్రీవిష్ణు చాలా సహాయం చేశారు’ అని ఇవానా చెప్పింది. ఈ సినిమా ప్రెస్‌మీట్ సందర్భంలో అక్కడికొచ్చిన అభిమానులు ‘లవ్‌టుడే’లో తన క్యారెక్టర్ నేమ్ అయిన బుజ్జి పేరుతో ‘బుజ్జి కన్నా’ అని పిలవడం ఆనందాన్నిచ్చిందని, పాత్ర పేరును గుర్తుపెట్టుకొని పిలవడానికి మించిన ఆనందం ఓ నటికి మరొకటి ఉండదని తెలిపింది. ‘రియల్ లైఫ్‌కి రిలేట్ అయ్యే పాత్రలు చేయాలన్నది నటిగా నా లక్ష్యం. ప్రస్తుతం పీజీ చేస్తున్నా. ఓవైపు చదువుకుంటూనే సినిమాల్లో నటిస్తున్నా. తెలుగు, తమిళంలో మంచి ఆఫర్లొస్తున్నాయి’ అని ఇవానా చెప్పింది.