కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya). ఈ అక్కినేని హీరో ప్రస్తుతం కస్టడీ (Custody) సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో NC 22గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇటీవలే కస్టడీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో అప్డేట్ అందించాడు నాగచైతన్య. చైతూ కస్టడీ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్నపుడు తీసిన స్టిల్స్ ను అందరితో పంచుకున్నారు మేకర్స్. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. కస్టడీ మే 12న థియేటర్లలో విడుదల కానుంది. బంగార్రాజు లాంటి హిట్ తర్వాత ఉప్పెన ఫేం కృతిశెట్టి మరోసారి కస్టడీలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్ శివ పాత్రలో చైతూ కనిపించబోతున్నాడు.
కస్టడీ ప్రీ లుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కస్టడీకి సంగీతం అందిస్తున్నారు.
గతేడాది నాగచైతన్య బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చడ్డా సినిమాలో మెరిశాడు. ఇది చైతూకు హిందీలో డెబ్యూ ప్రాజెక్ట్ కాగా.. ఊహించని స్థాయిలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.
నాగచైతన్య డబ్బింగ్ స్టిల్స్..
#Custody DUBBING WORK BEGINS 🎙️❤️🔥
Post Production is in Full Swing & the TEASER HUNT Begins Shortly! 🤩 #CustodyOnMay12@chay_akkineni @vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar @SS_Screens #Priyamani @srkathiir pic.twitter.com/8F4yA8ttZS
— Srinivasaa Silver Screen (@SS_Screens) March 6, 2023
— Srinivasaa Silver Screen (@SS_Screens) March 6, 2023
కస్టడీ గ్లింప్స్ వీడియో..
Read Also :
Dasara | దసరా మూడో సాంగ్.. ఛమ్కీలా అంగీలేసి ప్రోమో అదిరింది
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Saindhav | వెంకటేశ్ సైంధవ్‌లో హీరోయిన్ ఫైనల్.. ఇంతకీ ఎవరో తెలుసా..?