ప్రసుతం టాలీవుడ్లో భీమ్స్ సిసిరోలియో టైమ్ నడుస్తున్నది. ఈ సంక్రాంతి బరిలో ఆయిదు సినిమాలు విడుదలైతే.. అందులో రెండు సినిమాలకు భీమ్సే సంగీత దర్శకుడు. వాటిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుండగా, ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆ సినిమాల పాటలే. త్వరలో భీమ్స్ రాగాలు బాలీవుడ్లో కూడా వినిపించనున్నాయి.
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ స్వరాలందించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాలీవుడ్లో రీమేక్ కానుంది. అక్షయ్‌కుమార్ ఇందులో హీరోగా నటిస్తారు. ఈ సినిమాకు భీమ్స్ స్వరాలందించనున్నారట. ప్రస్తుతం ఆ పనిమీదే ఆయన ముంబాయిలో ఉన్నట్టు తెలిసింది. భీమ్స్ హిందీ సినిమాకు సంగీత దర్శకత్వం వహించనున్నట్టు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సక్సెస్‌మీట్‌లో రవితేజ కూడా వెల్లడించారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సివుంది.