Rakesh Bedi | రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా ఈవెంట్లో భాగంగా సీనియర్ నటుడు రాకేశ్ బేడీ, యువ నటి సారా అర్జున్ను ముద్దుపెట్టుకోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్లో భాగంగా సారా వేదికపైకి రాగానే, రాకేశ్ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకున్నారు. అయితే, కొందరు నెటిజన్లు దీనిని ‘ఒక యువతి పట్ల వృద్ధుడి ప్రవర్తన’ అంటూ తప్పుగా చిత్రీకరించారు. అయితే ఈ విమర్శలపై రాకేష్ ఘాటుగా సమాధానమిస్తూ అసలు ఏం జరిగిందో వివరించారు.
ధురంధర్ సినిమా షూటింగ్ సమయంలో మేమిద్దరం తండ్రీకూతుళ్లలాగే మెలిగాము. సారా తన ప్రతి విషయాన్ని నాతో పంచుకునేది. ఆ అనుబంధమే తెరపై కూడా కనిపిస్తుంది. ఆరోజు వేదికపైకి రాగానే ఆప్యాయతతోనే ఆమెను పలకరించాను. అది ఒక తండ్రి తన కూతురికి ఇచ్చే ముద్దు మాత్రమే. ప్రతి విషయాన్ని తప్పుగా చూడటం మనుషుల తెలివితక్కువతనం. తండ్రి ప్రేమని చూడలేకపోయిన వారు చేసే విమర్శలకు మనం ఏమీ చేయలేం. అంటూ రాకేష్ బేడీ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వివాదం ముగిసినట్లు తెలుస్తుంది.