Vijay | లాస్ట్ పంచ్ అదిరిందిగా.. రాజకీయ నేపథ్యంతో విజయ్ చివరి సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
తమిళ అగ్ర నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తను నటించబోయే 69వ సినిమానే తన ఆఖరి సినిమాగా విజయ్ ప్రకటించారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడెవరు? అనే విషయంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తున్నది.
Vijay | తమిళ అగ్ర నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తను నటించబోయే 69వ సినిమానే తన ఆఖరి సినిమాగా విజయ్ ప్రకటించారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడెవరు? అనే విషయంపై మీడియాలో పెద్ద చర్చే నడుస్తున్నది. వెట్రిమారన్, లోకేష్ కనకరాజ్‌ల పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఇప్పుడు కొత్త పేరు వార్తల్లోకొచ్చింది. షారుక్‌ఖాన్‌కి బ్లాక్బాస్టర్ ‘జవాన్’ అందించిన అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
విజయ్‌తో అట్లీ చేసిన తేరీ, మెర్సల్, బిగిల్ చిత్రాలు భారీ విజయాలను అందుకొని అట్లీని స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ఆ విశ్వాసంతోనే విజయ్కోసం అద్భుతమైన కథను తయారు చేశాడట అట్లీ. పూర్తి రాజకీయ నేపథ్యంతో, విజయ్ పొలిటికల్ కెరీర్‌కి కూడా ఉపయోగపడేలా ఈ కథ తయారు చేశాడట అట్లీ. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానున్నదని సమాచారం. సినిమాకు సంబంధించిన నిర్మాతల వివరాలు తెలియాల్సి వుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

