అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ కంపోజిషన్‌లో, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు మారుతి విడుదల చేసి, మేకర్స్‌కి శుభాకాంక్షలు అందించారు. గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ‘మనసుని, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు మాత్రమే ఉంది.
ఏ పేటెంట్ లేకుండా ప్రపంచానికి మన దేశం అందించిన కానుక యోగా. అన్ని భాషలవారికీ అర్థం కావాలనే ఉద్దేశ్యంతోనే దైవభాష అయిన సంస్కృతాన్ని ఈ పాటలో ఎక్కువగా వాడాను.’ అని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన యోగాంధ్ర సెలబ్రేషన్స్‌లో ఈ పాటకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని, ఈ పాటకు అన్నీ అద్భుతంగా కుదిరాయని ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ పేర్కొన్నారు.