3 Roses S2 Teaser | తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) లో సూపర్ హిట్ అయిన ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ ఇప్పుడు రెండవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సీజన్ 2 టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మొదటి సీజన్లో ఇషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సీజన్ 2లో ఇషా రెబ్బాతో పాటు రాశీ సింగ్ మరియు కుషిత కల్లపు కొత్త ‘రోజెస్’గా కనిపించనున్నారు. కమెడియన్ వైవా హర్షతో పాటు సత్య కూడా నవ్వులు పూయించడానికి రెడీగా ఉన్నారు. ఎస్.కె.ఎన్ నిర్మాణంలో, కిరణ్ కారవల్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ డిసెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టీజర్‌ను మీరు కూడా చూసేయండి.