Isha Koppikar | బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ జమ్మూకశ్మీర్ కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. నవరాత్రి తొమ్మిదో రోజున వైష్ణోదేవి ఆలయానికి వచ్చామని.. గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని తెలిపింది. అందరికీ వైష్ణోదేవి ఆశీస్సులు లభిస్తాయని తెలిపింది. రామ నవమి రోజున మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో పరిపాలన ఏర్పాటు చేసింది. దేవస్థానం బోర్డు స్మార్ట్ లాకర్ వ్యవస్థను ప్రారంభించింది. గత తొమ్మిది రోజుల్లో 50వేల మందికిపైగా ఉచిత ఆహారం (లంగర్) తీసుకున్నారని బోర్డు సీఈఓ గార్గ్ పేర్కొన్నారు.
ఇషా కొప్పికర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు, హింది, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. ‘ఏక్ తా దిల్ ఏక్ తి ధడ్కన్’ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో నాగార్జునతో ‘చంద్రలేఖ’ సినిమాలో నటించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత కాంటేలోని ఇష్క్ సముందర్ కంపెనీలోని ఖల్లాస్ తదితర స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. ఇషా కొప్పికల్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో ప్రేమతోరా, కేశవ చిత్రాల్లో నటించింది. చివరిసారిగా తమిళంలో అలయాన్ మూవీల నటించింది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నది.