Telugu audience Tired of Re releases | రీ రిలీజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా తర్వాత ఈ ట్రెండ్ బాగా పెరిగింది. తమ అభిమాన హీరోల పుట్టినరోజు సందర్భంగా పాత సినిమాలను 4K వెర్షన్లో విడుదల చేసి వేడుకలు జరుపుకోవడం ఫ్యాన్స్‌లో ఒక కొత్త రకమైన జోష్ని తెచ్చింది. ఇలానే విడుదలై ‘పోకిరి’, ‘జల్సా’, ‘సింహాద్రి’, ‘ఖలేజా’ వంటి చిత్రాలు భారీ వసూళ్లను సాధించాయి. అయితే ఈ ట్రెండ్ తాజాగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం మొన్న వచ్చిన చిరంజీవి స్టాలిన్‌తో పాటు నేడు విడుదలైన పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోగా.. చాలా థియేటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకులు రాలేదని షోలు కూడా రద్దు చేశారు. అయితే తాజాగా ఇదే సంఘటన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడికి జరిగింది. తమ్ముడు సినిమా నేడు రీ రిలీజ్ అవ్వగా.. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో పలు థియేటర్లలో షోలను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిణామాలను గమనిస్తే ప్రేక్షకులకు రీ-రిలీజ్‌లపై ఆసక్తి తగ్గిపోయిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
మరోవైపు ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఓటీటీ కాగా.. మరోకటి హిట్ సినిమాలకు మాత్రమే రీ రిలీజ్ లలో కలెక్షన్లు రావడం. స్టాలిన్, తమ్ముడు లాంటి సినిమాలు విడుదలయినప్పుడే యావరేజ్‌గా నిలిచాయి. అయితే ఇలాంటి మిక్సడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలను రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎవరు వస్తారనే టాక్ నడుస్తుంది. స్టాలిన్, తమ్ముడు ఇచ్చిన ఎఫెక్ట్ ఇకపై రీ-రిలీజ్‌ల విషయంలో సినీ నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలుపుతుంది. అలాగే కేవలం పుట్టినరోజుల సందర్భంగా కాకుండా, నిజంగా క్లాసిక్ సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
#Thammudu4K – Many Shows are Getting Cancelled Due to Lack of Audience!! pic.twitter.com/Odp5znlK2s
— cinee worldd (@Cinee_Worldd) August 30, 2025
Except for #MaheshBabu For All Other Stars ReRelease Trend is Almost End!!#Stalin4K became All Time Epic Disaster….#Ragada4K Failed Miserably & #Thammudu4K is all Set to become the No1 ReRelease Disaster with not even 1 Housefull Show!!
— cinee worldd (@Cinee_Worldd) August 30, 2025