Ram Charan Emotional on His Grand mother Death | టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు కుటుంబంతో పాటు మెగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే అరవింద్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు వచ్చి సంతాపం తెలుపుతున్నారు.
అయితే తన అమ్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న నటుడు రామ్ చరణ్ మైసూరులో తన సినిమా షూటింగ్‌ను మధ్యలో ఆపేసి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. అనంతరం అమ్మమ్మ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే మేనమామ అరవింద్‌తో పాటు అల్లు అర్జున్‌ని రామ్ చరణ్ ఓదార్చారు. పెద్ది సినిమా షూటింగ్లో మధ్యలో ఆపేసి వచ్చిన రామ్ చరణ్ మళ్లీ మైసూర్ వెళుతున్నట్లు సమాచారం.